మహిళపై చిరుతపులి దాడి
Leopard attack on woman: ఆదిలాబాద్ జిల్లాలో మరోసారి చిరుత విరుచుకుపడింది. బజార్ హత్నూర్ మండలం డెడ్రాలో బహిర్భూమికి వెళ్లిన మహిళ భీమాబాయిపై చిరుత దాడి చేసింది. చిరుత దాడిలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న బాధితురాలిని స్థానికులు గమనించి చికిత్స నిమిత్తం ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. డిప్యూటీ ఎఫ్ఆర్‌వో ప్రవీణ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.