తెలంగాణ అసెంబ్లీలో ఆంక్షలు
Telangana Assembly:తెలంగాణ అసెంబ్లీలో పలు ఆంక్షలు విధించారు. శాసనసభ చరిత్రలో మొదటిసారి ఇలాంటి ఆంక్షలు విధించడం పట్ల నిరసనల వ్యక్తం అవుతున్నాయి. మాజీ ప్రజాప్రతినిధులకు ఇన్నర్ లాబీల్లోకి ప్రవేశం లేదంటూ అసెంబ్లీ ఆవరణలో బోర్డులు పెట్టారు. మాజీ ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీ,ఎంపీలకు అనుమతి లేదంటూ ఈ బోర్డులు ఏర్పాటు చేశారు. ఇవేం నిర్ణయాలంటూ చట్టసభల మాజీ ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ చరిత్రలోనే మొదటి సారిగా మాజీ ప్రజాప్రతినిధులకు నో ఎంట్రీ బోర్డు పెట్టారని మండిపడుతున్నారు. ఇక, మీడియాపై కూడా తొలిసారి ఆంక్షలు విధించారు. అసెంబ్లీ పరిసరప్రాంతాల్లో వీడియోలు,ఫోటోలు చిత్రీకరించొద్దని ఆదేశాలు జారీ చేశారు.