బ్రేకింగ్ : నలుగురు యువకుల ఆత్మహత్యాయత్నం
తాము దొంగతనం చేయకున్నా చేసినట్టు ఒప్పుకోవాలని పోలీసులు వేధిస్తున్నారని నలుగురు యువకులు ఆత్మహత్యాయత్నం చేసుకోవడం కలకలం సృష్టించింది. ఆ నలుగురు సెల్ఫీ వీడియో తీసుకుని మరి ఆత్మహత్యాయత్నం పాల్పడ్డారు. మందమర్రి పట్టణానికి చెందిన నలుగురు యువకులు దొంగతనం చేయకున్నా దొంగతనం కేసు నమోదు చేసి ఒప్పుకోవాలని వేధింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సూపర్ వాస్మల్ తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. వారిని కుటుంబ సభ్యులు మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన వారిలో మెస్రం రాజు, ఆవుల షారుక్, బమండ్ల శివ, ,అజ్జు ఉన్నారు.