గూగుల్‌లో పనిచేసేవారికి షాక్.. 10 శాతం ఉద్యోగులు ఔట్
గూగుల్ సంస్థ మరో కీలక ప్రకటన చేసింది. తమ కంపెనీలో కొంతమందిని తొలగిస్తున్నామని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ శుక్రవారం వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా తమ ఉద్యోగుల్లో 10 శాతం మందిని తొలగిస్తామని తెలిపారు. కొంతకాలంగా ఐటీ కంపెనీల్లో లే ఆఫ్ భయాలు ఉద్యోగులను వెంటాడుతున్నాయి. ఇప్పటికే అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్,ఫేస్‌బుక్ వంటి దిగ్గజ కంపెనీలు సైతం కొంతమంది ఉద్యోగులను తొలగించిన సందర్భాలు ఉన్నాయి. అయితే తాజాగా గ్లోబల్ టెక్ దిగ్గజం గూగూల్ లేఆఫ్స్‌కి సంబంధించి మరో కీలక ప్రకటన చేసింది. తమ కంపెనీలో కొంతమందిని తొలగిస్తున్నామని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ శుక్రవారం వెల్లడించారు.
ముఖ్యంగా మేనేజర్, డైరెక్టర్, వైస్ ప్రెసిడెంట్ లాంటి కీలక స్థానాల్లో ఉన్న ఉద్యోగులపై కూడా కోతలు ఉంటాయని సుందర్ పిచాయ్ చెప్పారు. ఓ గూగుల్ ప్రతినిధి దీనికి సంబంధించి పలు కీలక విషయాలు చెప్పారు. గూగుల్ సంస్థలో మేనేజర్, డైరెక్టర్, వైస్ ప్రెసిడెంట్ లాంటి కీలక స్థానాలు తగ్గించవచ్చు… మరికొందరు ఉద్యోగులను కూడా తీసివేసే ఛాన్స్ ఉందన్నారు. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రపంచంలో ఉన్న పోటీని ఎదుర్కొనేందుకు.. ఒపెన్ ఏఐ లాంటి ప్రత్యర్థులతో గట్టి పోటీ ఉన్నందున ఉద్యోగుల్లో ఇలాంటి మార్పులు ఉండవచ్చని గూగుల్ ప్రతినిధి తెలిపారు. ప్రస్తుతం గూగుల్ కూడా AIలో కొత్త మోడల్స్‌ను తీసుకొస్తూనే ఉంది. ఈ ఏడాది డిసెంబర్ ప్రారంభంలో జెమిని 2.0 లేటెస్ట్ ఏఐని కూడా ప్రారంభించింది.