అక్రిడిటేషన్ గడువు పొడిగింపు
media accreditation cards: జర్నలిస్టుల అక్రిడిటేషన్ గడువు మూడు నెలల పాటు పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ ఎస్.హరీశ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అక్రిడిటేషన్ కార్డుల గడువు ఈ నెల 31వ తేదీతో ముగియనుంది. తెలంగాణ మీడియా అక్రిడిటేషన్ రూల్స్ -2016 సమీక్షించేందుకు ఏర్పాటైన ప్రత్యేక కమిటీ త్వరలో దానికి సంబంధించిన సిఫార్సులను చేయనుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాజా మార్గదర్శకాలు విడుదల చేస్తుంది. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత అక్రిడిటేషన్ కోసం దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ మేరకు జనవరి 1. 2025 నుంచి మార్చి 31, 2025 వరకు అక్రిడిటేషన్ కార్డుల గడువును పొడిగిస్తూ ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లు, ఆర్టీసీ సంస్థకు సంబంధిత శాఖ అధికారులు సమాచారం అందజేశారు.