తెలంగాణ నేతల లేఖలు చెల్లుబాటు
Tirumala Tirupati devastanam: తెలంగాణలోని ప్రజాప్రతినిధుల లేఖలను అనుమతించాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం తీసుకుంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రుల సిఫారసు లేఖలు తీసుకోనుంది. తెలంగాణ ప్రజాప్రతినిధులు ఇక మీదట వారానికి రెండు మార్లు సిఫారసుల లేఖలను అనుమంతిచాలని నిర్ణయించినట్లు టీటీడీ స్పష్టం చేసింది. అంటే ఒక వారంలో… టీటీడీ రెండు మార్లు ఆయా ప్రజా ప్రతినిధుల సిఫారసుల మీద దర్శనానికి వచ్చిన వారికి ప్రత్యేకంగా శ్రీవారి దర్శనం అయ్యేలా అనుమతిస్తారన్నమాట.
కూటమి సర్కార్ అధికారం చేపట్టాక తెలంగాణ ప్రజా ప్రతినిధుల లేఖలను పట్టించుకోని టీటీడీ. ఇటీవల ఇదే అంశాన్ని ప్రశ్నించిన బల్మూర్ వెంకట్ , అనిరుద్ రెడ్డితోపాటు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. టీటీడీ తీరుపై తెలంగాణ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. తెలంగాణ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుమలపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా.. దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సైతం.. తిరుమలలో ఎక్కువగా తెలంగాణ భక్తులు వస్తున్నారని.. తెలంగాణ వారి వల్లే తిరుమలకు ఆదాయం సమకూరుతుందని అన్నారు. పలువురు తెలంగాణ ప్రజా ప్రతినిధులు తిరుమలలో తమ లేఖలను అనుమతించాలని.. తెలంగాణ నుంచి వచ్చే భక్తులకు లేఖలు ఇచ్చేందుకు తమకు వెసులుబాటు కల్పించాలని కోరుతూ వచ్చారు. తిరుమలలో బల్మూర్ వెంకట్, ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి బహిరంగంగా మీడియాతో మాట్లాడారు. టీటీడీ చైర్మన్‌గా బి.ఆర్.నియామకం అయ్యాక కూడా హరీష్‌రావును కలిసిన క్రమంలో ఆయన కూడా తెలంగాణ ఎమ్మెల్యేల సిఫార్సులేఖలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. తెలంగాణ ప్రజా ప్రతినిధుల లేఖలకు తిరుమలలో ప్రాధాన్యత ఇచ్చేలా నిర్ణయం తీసుకోవాలని సీఎం చంద్రబాబును, తెలంగాణ సీఎం రేవంత్ కోరారు. దీంతో తెలంగాణ ప్రజా ప్రతినిధులు ప్రస్తుతం హోదాలో ఉన్న వారు ఇచ్చే సిఫార్సు లేఖలను ప్రతీ వారం రెండు రోజుల పాటు అంగీకరించాలని నిర్ణయం తీసుకున్నారు.