కాంగ్రెస్ రాష్ట్ర వ్యాప్త ఆందోళన
ఈ నెల 24, 25 తేదీల్లో కాంగ్రెస్ పార్టీ వ్యాప్త ఆందోళన నిర్వహించనుంది. 24న అన్ని మండల కేంద్రాలలో పార్టీ మండల అధ్యక్షుల నేతృత్వంలో కేంద్ర, రాష్ట్ర ప్రజా వ్యతిరేక విధానాలు, ధాన్యం కొనుగోలు, స్థానిక అంశాలపై మండల తహశీల్దార్ లకు వినతిపత్రాలు ఇవ్వనున్నారు. 25వ తేదీన జిల్లా కేంద్రాలలో డీసీసీ అధ్యక్షుల నేతృత్వంలో జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వానున్నారు. ఈ కార్యక్రమాలకు సంబంధించి ఒక్కో జిల్లాకు ఒక్కో జిల్లా ఇంఛార్జీని నియమించారు. పార్టీ శ్రేణులు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్, ఇంచార్జి ఆర్గనైజేషన్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.