వైన్ షాపులో దొంగతనానికి వచ్చి తాగి పడుకున్న దొంగ
A drunken thief who robbed a wine shop: ఓ దొంగ మద్యం షాపులో దొంగతనానికి వచ్చి ఫుల్లుగా మద్యం తాగి నిద్ర పోయాడో దొంగ.. ఈ ఘటన తెలంగాణ మెదక్ జిల్లాలోని నార్సింగి కనకదుర్గ వైన్స్ లో జరిగింది. ఆదివారం రాత్రి వైన్ షాపు మూసేసి ఇంటికి వెళ్లారు యజమాని. ఓ వ్యక్తి ఇందులో దొంగతనానికి వచ్చాడు. కౌంటర్ లో నగదు, మద్యం బాటిళ్లు ఓ సంచిలో మూట కట్టుకున్నాడు. దొంగతనం తర్వాత వెళ్ళేటప్పుడు మద్యం తాగడంతో మత్తులోనే అక్కడే నిద్రపోయాడు. సోమవారం షాపు తెరిచి చూడగా వైన్ షాపులో దొంగ అలాగే నిద్రపోతూ ఉన్నాడు. దీంతో యజమాని దొంగను పోలీసులకు పట్టించాడు. దీంతో పోలీసులు వచ్చి దొంగని ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఎలాంటి ఆధారాలు దొరక్కుండా సీసీ కెమెరాలు, హార్డ్ డిస్క్ లు ధ్వంసం చేసిన దొంగ తాను మాత్రం తాగి హాయిగా పడుకుని నేరుగా పోలీసుకుల దొరికాడు.