కబళించిన మృత్యువు.. నలుగురి మృతి
Road Accident: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు యువకులు మృత్యువాత పడగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. బెజ్జూర్ మండలంలో ద్విచక్ర వాహనం అదుపు తప్పి ఇద్దరు మృతి చెందారు. బెజ్జూర్ ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. చింతలమానపల్లి మండలం దింద గ్రామానికి చెందిన మెస్రం సాయి, ఇప్పలగూడ గ్రామానికి చెందిన నైతం అజయ్, మొగవెల్లి గ్రామానికి చెందిన ఆత్రం షణ్ముఖ అనే ముగ్గురు మిత్రులు కలిసి తమ బంధువుల ఇండ్లకు బైక్‌పై వస్తున్న క్రమంలో ఇప్పలగుడ గ్రామ సమీపంలో ద్విచక్ర వాహనం అదుపు తప్పింది. దీంతో దింద గ్రామానికి చెందిన మెస్రం సాయి అక్కడికక్కడే మృతిచెందాడు. ఇప్పలగూడ గ్రామానికి చెందిన నైతం అజయ్, మొగవెల్లి గ్రామానికి చెందిన ఆత్రం షణ్ముఖ పరిస్థితి విషమంగా ఉండడంతో కాగజ్‌నగర్ ఆస్పత్రికి తరలించే క్రమంలో మరో యువకుడు మృతి చెందాడు. ఇక మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రం వద్ద కస్తూర్బా పాఠశాల వద్ద కడెం మెయిన్ కెనాల్ వద్ద అదుపు తప్పి పడటంతో ఇద్దరు యువకులు పవన్, రాజు మృత్యువాత పడ్డారు. వీరిద్దరూ దండేపల్లి ఎస్సీ కాలనీకి చెందిన వారు. వారిద్దరి మృతదేహాలను లక్ష్సెటిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.