మందుబాబులు త‌గ్గ‌లే..

Drunk and drive tests: ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌లు అంబరాన్ని అంటాయి. ఈ వేడుక‌లు యువత ఎంతో ఉత్సాహంగా సెలబ్రేట్ చేసుకున్నారు. కొత్త సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికారు. కొంతమంది ఆడుతూ పాడుతూ కొత్త సంవత్సరానికి స్వాగ‌తం చెప్పగా.. మరికొందరు మాత్రం మందు తాగి హల్‌చల్ చేశారు. కొత్త సంవ‌త్స‌రం వేడుకల్లో నో ఆల్కహాల్ అంటూ పోలీసులు చెప్పినా పట్టించుకోలేదు. పీకల దాకా తాగుతూ రోడ్లపై తిరుగుతూ కొత్త సంవ‌త్స‌రం వేడుక‌లు నిర్వ‌హించుకున్నారు. మందు బాబులకు మాత్రం పోలీసులు గట్టి షాకే ఇచ్చారు. ఎక్కడికక్కడ తాగి వాహనాలు నడిపిన వారి పనిపట్టారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించి మందు సేవించిన వారిని పట్టుకున్నారు. వారిపై కేసులు కూడా నమోదు చేశారు. రామ‌గుండం క‌మిష‌న‌రేట్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. తాగి వాహనాలు నడుపుతున్నట్లు అనుమానం వచ్చిన వెంటనే పోలీసులు వారిని ఆపై మరీ బ్రీత్ ఎనలైజర్ టెస్టులు నిర్వహించారు. అర్ధ‌రాత్రి 12 గంట‌ల వ‌ర‌కు 98 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, 53 ఓవ‌ర్ స్పీడ్ కేసులు, హెల్మెట్ లేకుండా వాహ‌నాలు న‌డుపుతున్న వారికి సంబంధించి 1044 కేసులు న‌మోదు చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like