రాజకీయ కక్షలతోనే బురద చల్లుతున్నారు
ఆరిజిన్ డెయిరీ సంస్థ ఎండీ ఆదినారాయణపై దాడికి తనకు ఏం సంబంధం లేదని, రాజకీయ కక్షలతోనే నాపై బురద చల్లుతున్నారని బెల్లంపల్లి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సన్నిబాబు స్పష్టం చేశారు. కొందరు ప్రతిపక్ష నాయకులు ఈ అంశంపై అబద్దాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. మంత్రి శ్రీధర్ బాబు, ఎంఎల్ఏ వినోద్ వెంకటస్వామి కలిసి ఈ దాడి చేయించినట్టుగా విషప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇందులో తనను కూడా ఇరికిస్తున్నారని అన్నారు. దాడి సమయంలో తనకు ఆరోగ్యం బాలేక ఆసుపత్రిలో ఉన్నానని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో ఉద్దేశ్యపూర్వకంగా తమపై బురదజల్లుతున్నారని అన్నారు.
ఈ అసత్య ఆరోపణలను, విషప్రచారాలను జనం నమ్మే పరిస్థితిలో లేరన్నారు. నాకు, ఈ దాడులకు ఎలాంటి సంబంధం లేదని మరోమారు స్పష్టం చేశారు. దాడి చేసినవారికి ఆదినారాయణకు వ్యక్తిగత గొడవల వలన ఈ సంఘటన జరిగిందని అందరికీ తెలుసన్నారు. వారి వ్యక్తిగత విషయాలపై జరిగిన దాడుల్లో నన్ను అనవసరంగా లాగడం అంటేరాజకీయ కక్షతోనే అని అర్ధమవుతుందన్నారు. ఇష్టారీతిగా సోషల్ మీడియాలో రాయడం, ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాని తెలిపారు. తనపై ఇష్టరీతిన ప్రచారం చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.