సాగు యోగ్యమైన భూములకు రైతు భరోసా
CM Revanth Reddy: సాగు యోగ్యమైన భూములకే రైతు భరోసా ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి ఎకరాకు రూ.12,000 ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. భూమిలేని నిరుపేదలకు ఏడాదికి రూ. 2,000 ఇస్తామన్నారు. రేషన్ కార్డులు లేని వారికి సైతం వాటిని అందిస్తామన్నారు. రైతు భరోసాకు సంబంధించి వస్తున్న వార్తలపై ఆయన క్లారిటీ ఇచ్చారు. రియల్ ఎస్టేట్, నాలా కన్వర్షన్, రాళ్ళురప్పలు ఉన్న భూములు, పరిశ్రమలకు తీసుకున్న భూములకు, వ్యవసాయ యోగ్యం కాని భూములకు రైతుభరోసా ఇవ్వమని స్పష్టం చేశారు. గ్రామసభల ద్వారా వివరాలు సేకరించి పథకాలు అమలు చేస్తామని చెప్పారు.
జనవరి 26 నుండి ఈ మూడు పథకాలు అమలు చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు.