తాండూర్ మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్
సంక్రాంతి పండగ సందర్బంగా ఈ నెల 10న మాదారంలో తాండూర్ మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. తాండూరు మండలంలోని క్రీడాకారులు టోర్నమెంట్లో పాల్గొనాలని కోరారు. ఈ నెల 09న మధ్యాహ్నం 12:00 గంటలకు డ్రా తీస్తామని వెల్లడించారు. 10వ తేదీ నుండి క్రీడలు ప్రారంభం అవుతాయన్నారు. దీనికి ఎంట్రీ ఫీజు 1100గా నిర్ణయించినట్లు తెలిపారు. క్రీడల్లో మొదటి బహుమతిగా రూ.20,000 రెండో బహుమతిగా రూ.10, 000 అందజేయనున్నారు. ఏ గ్రామ పంచాయితీలోని క్రీడాకారులు ఆ పంచాయితీలోనిటీం లోనే ఆడాలన్నారు. మరిన్ని వివరాలకు నిర్వాహకులు సాగర్ – 8008470147, అఖిల్ – 7569944578 లను సంప్రదించాలని కోరారు.