ఇంటలిజెన్స్ ఎస్పీపై వేటు

Nalgonda District Intelligence SP Ganji on Kavitha నల్గొండ జిల్లా ఇంటలిజెన్స్ ఎస్పీ గంజి కవితపై వేటు పడింది. కవితను డీజీపి కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కవిత పై పెద్ద ఎత్తున అక్రమాలు, వసూళ్ల ఆరోపణలు వస్తున్నాయి. ప‌దిహేను రోజులుగా కవిత అక్రమాల పై ఫోకస్ పెట్టిన రాష్ట్ర నిఘా విభాగం రేషన్, గుట్కా మాఫీయా నుంచి అక్రమ వసూళ్లు చేసిన‌ట్లు గుర్తించారు. పోలీసు ఉన్నతాధికారుల విచారణలో విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. ఇక కింది స్థాయి సిబ్బంది వద్ద కూడా చేతివాటం ప్రదర్శించినట్టు నిర్దారణకు వచ్చింది. ఏకంగా సిబ్బందితోనే అధిక వ‌డ్డీలు, రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారాలు చేయించిన‌ట్లు గుర్తించారు. కవిత అక్రమాల్లో ఒక ఎస్ఐ, ముగ్గురు కానిస్టేబుల్లు, ఒక హెడ్ కానిస్టేబుల్ పాలు పంచుకున్నట్లు సమాచారం. కవిత షాడో టీమ్ పైన విచారణ కొనసాగుతోంది. మ‌రోవైపు ఆమె అవినీతిపై కిందిస్థాయి సిబ్బంది తొమ్మిది పేజీల లేఖ రాశారంటే ప‌రిస్థితి అర్ధం చేసుకోవ‌చ్చు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like