పేకాటస్థావరంపై పోలీసుల దాడి

Police attack On a poker base: పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి ఐదుగురిని అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లా జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో టేకుమట్ల గ్రామ శివారులోని ఒక ఫాంహౌస్ లో పేకాట ఆడుతున్న ఐదుగురిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడిలో రూ. 20,040 నగదు, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
టేకుమట్ల గ్రామ శివారులోని ఒక ఫాం హౌస్ రహస్యంగా డబ్బులు పందెం పెట్టి పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు మంచిర్యాల టాస్క్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ రాజ్ కుమార్, ఎస్ఐ లచ్చన్న, సిబ్బందితో కలిసి పేకాట స్థావరంపై దాడి చేశారు. ఈ దాడిలో ఉసేటి వెంకట్రావ్ (ఎన్‌టీపీసీ, కృష్ణానగర్), ఇందుకూరి కృష్ణంరాజు (కృష్ణ నగర్), బొబ్బిలి పరమేష్ (కూకట్‌పల్లి, హైదరాబాద్), ధర్మాజీ లక్ష్మణ్ (ఎన్‌టీపీసీ,జంగాలపల్లి), కుల సంతోష్ (అంతర్గాం)ను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వ్యక్తులు, స్వాధీనం చేసుకున్న నగదు, సెల్ ఫోన్లనువిచారణ నిమిత్తం జైపూర్ పోలీసులకు అప్పగించారు.