రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలి మృతి
రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొని ఓ వృద్ధురాలు మృత్యువాత పడింది. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం రెపల్లెవాడ లో రోడ్డు ప్రమాదం సంభవించింది. రోడ్డు దాటేందుకు ప్రయత్నం చేస్తున్న కోట భూదేవి అనే వృద్ధురాలిని లారీ ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. లారీ ఆమె శరీరం పై నుండి వెళ్లడంతో శరీరం నుజ్జు నుజ్జు అయ్యింది. ప్రమాడానికి సంబందించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.