బ్యాంక్ అధికారుల వేధింపులతో రైతు ఆత్మహత్య

Farmer suicide: బ్యాంక్ అధికారుల వేధింపులు తట్టుకోలేక రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం సృష్టించింది. ఆదిలాబాద్ పట్టణంలోని ఐసిఐసిఐ బ్యాంక్ లో రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తీసుకున్న అప్పు చెల్లించడం లేదని బ్యాంక్ అధికారులు వేధింపులకు పాల్పడడంతో బేల మండలం రేణిగూడకు చెందిన రైతు జాదవ్ దేవరావు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. జిల్లా కేంద్రంలోని టీచర్స్ కాలనీ ఐ సిఐసీఐ బ్యాంక్ లో దేవరావు మార్ట్ గేజ్ రుణం తీసుకున్నాడు. వాయిదా చెల్లించడం ఆలస్యం కావడంతో బ్యాంకు ఉద్యోగులు పదే పదే అడిగారు. దీంతో బ్యాంకులోకి మందు డబ్బా తీసుకుని వచ్చిన ఆయన అక్కడే మందు తాగాడు. ఆయనను ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ తరలించారు. అక్కడ ఆయన మృత్యువాత పడ్డాడు. బ్యాంకు సిబ్బంది, అధికారుల వేధింపుల వల్లనే మృతి చెందాడని ఆరోపించిన బంధువులు బ్యాంకు ఎదుట ఆందోళన నిర్వహించారు.