ఐచర్ వాహనం బోల్తా.. 47 మందికి గాయాలు..

Road Accident: జాతరకు వెళ్తున్న ఐచర్ వాహనం బోల్తా పడడంతో 47 మందికి గాయాలయ్యాయి. అందులో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం కొత్తపల్లి ఘాట్ రోడ్ లొ ఐచర్ వాహనం బోల్తా పడింది. వీరంతా గుడిహత్నూర్ మండలం సూర్యగూడకు చెందిన వారు. కెరమేరి మండలం కోట పరందోలిలో జరుగుతున్న జంగుబాయి జాతరకు వెళ్తున్నారు . మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఘాట్ రోడ్డు లోని మూలమలుపు వద్ద ఐచర్ వాహనం అదుపుతప్పి లోయలో బోల్తా పడింది. ప్రమాద సమయంలో వాహనంలో ఉన్న 67 మంది ప్రయాణికుల్లో 47 మందికి గాయాలయ్యాయి. గాయాలైన వారిని నార్నూర్, ఉట్నూర్, అదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. వీరిలో 15 మందికి తీవ్రగాయాలు కావడంతో పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బ్రేక్ ఫెయిల్ అవ్వడం వల్ల ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.