కాళేశ్వరం ఆలయంలో అపచారం.

Kaleshwara Mukteswara Swamy Temple: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరం ముక్తేశ్వర ఆలయం (Kaleshwara Mukteswara Swamy Temple) లో అపచారం చోటుచేసుకుంది. గర్భగుడిలో ఓ ప్రైవేట్ ఆల్బమ్ షూటింగ్ కోసం గుడి తలుపులు మూసి ఏకంగా గర్భగుడిలో చిత్రీకరణ జరిపారు. దర్శనానికి వచ్చిన భక్తులను నిలిపివేసి మరి ఆల్బమ్ షూటింగ్ చేయడం గమనార్హం. ఆల్బమ్ షూటింగ్‌పై అధికారులు పట్టించుకోకపోవడం ఏమిటనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. లోపలికి వెళ్లాలంటే కనీసం సెల్‌ఫోన్లనే లోపలికి అనుమతించరు. అలాంటింది ఏకంగా కెమెరాలను తీసుకువెళ్లి మరీ ప్రైవేటు ఆల్బం చేయడం అధికారులకు తెలియకుండా జరగదని పలువురు స్పష్టం చేస్తున్నారు. ఆలయ పవిత్రతను అధికారులు దెబ్బతీస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని భక్తుల డిమాండ్ చేస్తున్నారు.
సాధారణంగా గుడిలోకి ఫోన్లనే అనుమతించరు. అలాంటిది ఏకంగా కెమెరాలను తీసుకెళ్లి ఏకంగా గర్భగుడిలో చిత్రీకరణ జరపడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. షూటింగ్ లకు అధికారులే అనుమతి ఇచ్చారా…? అనే అనుమానాలు కలుగుతున్నాయి. దీనిపై దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ స్పందించి వెంటనే నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.