ఘోర ప్ర‌మాదం.. ఏడుగురు మృతి

Warangal: వరంగల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అదుపుతప్పిన ఓ లారీ ఆటోలపై దూసుకెళ్లడంతో ఏడుగురు మృతి చెందారు. ఇనుప స్తంభాల లోడుతో వెళ్తున్న లారీ అదుపు రోడ్డు పక్కనే ఉన్న ఆటోలపై పడింది. ఈ ప్రమాదంలో చిన్నారితో సహా ఏడుగురు వ్యక్తులు మృతి చెందారు. ఐదుగురు అక్క‌డిక‌క్క‌డే మృత్యువాత ప‌డ‌గా, మ‌రో ఇద్ద‌రు ఆసుప‌త్రికి త‌ర‌లిస్తుండ‌గా చ‌నిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

ఇనుప స్తంభాలను తొలగించి మృతులను వెలికి తీయడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. ఇనుప రాడ్లతో వెళుతున్న లారీ ఆటోను ఓవర్ టేక్‌ చేయబోయి బోల్తా కొట్టింద‌ని, దీంతో అందులో ఉన్న ఇనుప రాడ్లు ఆ రోడ్డుపై వెళ్తున్న ఆటోల పైన పడినట్టు స్థానికులు చెబుతున్నారు. అయితే లారీని నడిపిన డ్రైవర్ మద్యం సేవించి ఉండడం ప్రమాదానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. ఈ ఘటన పైన సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. లారీ డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదం జరిగినచోట సహాయక చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికి తీస్తున్నారు. మృతుల వివరాలను సేకరించే పనిలో ఉన్నారు. ప్ర‌మాదం మామునూరు రోడ్డుపై జరగడంతో వరంగల్ ఖమ్మం రహదారిపైన పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. రోడ్డుపై అడ్డంగా పడిన ఇనుప స్తంభాలను జేసీబీల సాయంతో తొల‌గించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like