రంజాన్ సహనం, పరోపకారం, త్యాగం పెంపొదిస్తుంది

కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రంజాన్ కానుకగా ముస్లింలకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి, లక్షెట్టిపేట మండలం, లక్షెట్టిపేట పట్టణంలో మంచిర్యాల శాసనసభ్యుడు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆధ్వర్యంలో వీటి పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, జిల్లా డీసీసీ అధ్యక్షురాలు సురేఖ మాట్లాడుతూ ఎన్నికలకు సంబంధం లేకుండా ప్రతి సంవత్సరం రంజాన్ పండుగ సందర్భంగా రంజాన్ తోఫా ఇస్తున్నామని తెలిపారు. ఖురాన్ బోధనల ప్రభావం సమాజంపై ఎంతగానో ఉంటుందని, సహనం, పరోపకారం, త్యాగం వంటి మానవీయ విలువలు రంజాన్ మాసం పెంపొందిస్తుందని పేర్కొన్నారు. అనంతరం ముస్లీం సోదరిమణులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.