నకిలీ వైద్యులపై టాస్క్ ఫోర్స్ బృందం తనిఖీలు

న‌కిలీ వైద్యులు న‌డిపిస్తున్న క్లినిక్‌ల‌పై టాస్క్ ఫోర్స్ బృందం తనిఖీలు చేప‌ట్టింది. టీజీఎంసీ ఇతిక‌ల్ కమిటీ బృందం, IMA టాస్క్ఫోర్స్ బృందం వారికి అందిన ఫిర్యాదుల మేరకు మంచిర్యాల జిల్లా తాండూరు మండలం బోయపల్లి బోర్డు వద్ద ఈ త‌నిఖీలు కొన‌సాగాయి. మందల సదానందం (హెల్త్ కేర్ క్లినిక్) క్లినిక్ నడుపుతు మోతాదుకు మించి యాంటీబయోటిక్ మందులు, నొప్పి మందులు , iv ఫ్లూయిడ్స్, ఇతర హై షెడ్యూల్ మందులు ఇస్తూ ప్రజల ఆరోగ్యాల‌తో చెలగాటం ఆడుతున్నార‌ని టీజీఎంసీ సభ్యులు డాక్ట‌ర్‌ ఎగ్గన శ్రీనివాస్ టీజీఎంసీ ఇతికల్ కమిటీ స‌భ్యులు వివరించారు. వీరి బారిన పడి ప్రజలు మోసపోవద్దని, ఆరోగ్యాలు పాడు చేసుకోవద్దని వారు సూచించారు. అనారోగ్య సమయంలో దగ్గరలోని ప్రభుత్వ వైద్యశాలకు వెళ్ళాలని కోరారు. ఈ త‌నిఖీల్లో డాక్ట‌ర్లు ఉదయ్ కుమార్, అరవింద్, సంతోష్, ప్రవీణ్, రాజు పాల్గొన్నారు. ప్రజలు నకిలీ వైద్య వ్యవస్థ గురించి, హాస్పిటల్స్, ఏ విధమైన వైద్య సంబంధ ఫిర్యాదులు ఉంటే 7557555777 నంబర్ కి సమాచారం ఇవ్వాల‌ని కోరారు.

You might also like