అడవిలో బుల్డోజర్లు నడుపుతున్నారు

PM Modi : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అడవుల మధ్య బుల్డోజర్లు నడుపుతోంది. వన్యప్రాణుల నివాసాలను నేలమట్టం చేస్తూ, ప్రకృతి నాశనం చేయడం ప్రారంభించింది. ఇది చూస్తుంటే బాధ కలుగుతోంది. పచ్చదనాన్ని కాపాడాల్సిన ప్రభుత్వం… దాన్ని ధ్వంసం చేస్తే ఎలా?” అంటూ తీవ్రంగా విరుచుకుపడ్డారు మోదీ.. ఇదంతా తెలంగాణ ఈ మధ్య కాలంలో హాట్‌టాపిక్‌లా మారిన కంచ గచ్చిబౌలి భూముల గురించే.. హర్యానా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ మొట్ట మొదటిసారి తెలంగాణ కంచ గచ్చిబౌలి భూముల వివాదం గురించి స్పందించారు. తెలంగాణ ప్రజలకు చెందిన భూములను, ప్రకృతి సంపదను నాశనం చేసి, అభివృద్ధి పేరిట అసలు విలువల్ని తుంగలో తొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
“రాజకీయం అంటే మాకు అధికారం కోసం పోరాటం కాదు. దేశ ప్రజలకు సేవ చేయాలనే మాధ్యమం మాత్రమే. అందుకే బీజేపీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుంది. మాట ఇచ్చి మరిచే అలవాటు మాకు లేద”ని ప్రధాని స్పష్టం చేశారు. బీజేపీ పాలనలో నమ్మకం ఉందని సూచించారు. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే.. “వారు అధికారంలోకి రావాలన్న తాపత్రయంతో మోసపూరిత హామీలతో ప్రజలను మభ్యపెడుతున్నారు” అంటూ మండిపడ్డారు.