బ్రహ్మోస్ సత్తా.. పాకిస్తాన్‌ను అడగండి

Yogi: భారతదేశం ఇటీవల చేపట్టిన ఆపరేషన్ సింధూర్ దాడుల్లో పాకిస్తాన్, పీఓకే ఉగ్రస్థావరాలపై బ్రహ్మోస్ క్షిపణి వినియోగించినట్లు ఆయన ప్రకటించారు. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఏర్పాటు చేసిన బ్రహ్మోస్ మిస్సైల్ సెంటర్‌ను రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వర్చువల్‌గా ప్రారంభించారు. బ్రహ్మోస్ ఏరోస్పేస్ అండ్ టెస్టింగ్ ఫెసిలిటీ సెంటర్ ప్రారంభించిన కార్యక్రమంలో యూపీ సీఎ యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూపీ సీఎ యోగి మాట్లాడుతూ.. ఆపరేషన్ సింధూర్ లో బ్రహ్మోస్ వాడినందుకే భారత్ విజయవంతం అయ్యిందన్నారు. అందుకే తాము ఆత్మరక్షణ కోసం ఎదురుదాడి చేశామని పాకిస్తాన్ విదేశాంగ శాఖ కట్టుకథ మొదలుపెట్టిందన్నారు.
“ఆపరేషన్ సింధూర్‌లో బ్రహ్మోస్ క్షిపణి సామర్థ్యాన్ని మీరు చూసి ఉంటారు. మీరు చూడకపోయి ఉంటే, బ్రహ్మోస్ క్షిపణి సత్తా గురించి పాకిస్తాన్ ప్రజలను అడగండ”ని లక్నోలో బ్రహ్మోస్ ఉత్పత్తి యూనిట్ ప్రారంభోత్సవంలో యోగి సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్, పీఓకే లోని ఉగ్ర స్థావరాలపై భారత బలగాలు బ్రహ్మోస్ క్షిపణులతో దాడి చేసి సక్సెస్ సాధించామని యోగి ఆదిత్యనాథ్ చెప్పడంతో దేశ వ్యాప్తంగా ఇది హాట్ టాపిక్ అవుతోంది.