యువతకు ఉపాధి కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్

Singareni: సింగరేణి అధ్వర్యంలో భూపాలపల్లిలో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావుతో కలిసి సింగరేణి సీఎండీ బలరాం నాయక్ ప్రారంబించారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా ఎంతో మంది నిరుద్యోగ యువత ఉపాధి పొందే అవకాశం ఉందన్నారు. ప్రతీ ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
సింగరేణి సీఎండీ బలరాం నాయక్ మాట్లాడుతూ ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా శిక్షణ పొంది స్వయం ఉపాధి పొందే విధంగా తయారు కావాలని తెలిపారు. కార్యక్రమంలో డైరెక్టర్లు సూర్య నారాయణ (ఆపరేషన్), కె. వెంకటేశ్వర్లు (ప్రాజెక్ట్, ప్లానింగ్&పా), భూపాలపల్లి జీఎం ఏనుగు రాజేశ్వర్ రెడ్డి, ఎఐటీయూసీ జనరల్ సెక్రటరీ రాజ్ కుమార్, ప్రాతినిథ్య సంఘం జనరల్ సెక్రటరీ పి.రాజేందర్, అధికారుల సంఘం జనరల్ సెక్రటరీ పెద్ది నరసింహులు, జిఎం (హెచ్ఆర్డి) రఘుపతి ఎస్వో టూ జీఎం కవింద్ర, ఎంజీఎం ఐ ఈడి జ్యోతి, ఇతర ఉన్నత అధికారులు పాల్గొన్నట్లు ఏరియా అధికార ప్రతినిధి కావూరి మారుతి తెలిపారు.