శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు

Police:ఏ పండుగ వచ్చినా ప్రజలందరూ ఐకమత్యంతో కులమత బేధాలు లేకుండా సంతోషంగా జరుపుకోవాలని బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ సూచించారు. మంగళవారం సాయింత్రం తాండూర్ సర్కిల్ కార్యాలయంలో ముస్లిం మత పెద్దలతో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ బక్రీద్ పండుగ వస్తున్న నేపథ్యంలో ముందస్తుగా ముస్లిం మత పెద్దలతో కలిసి ఈ శాంతి కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రజల రక్షణ కోసం పోలీస్ సిబ్బంది అంకితభావంతో పనిచేస్తున్నారని వెల్లడించారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులకు సహకరించాలని కోరారు. ఏదైనా సమస్య ఉంటే తక్షణమే పోలీసులకు లేదా (డయల్ 100) కి సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ కుమారస్వామి, తాండూర్ ఎస్సై కిరణ్ కుమార్, మాదారం ఎస్సై సౌజన్య ముస్లిం మత పెద్దలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.