దళిత ఎంపీని అవమానిస్తారా..? సీఎం పర్యటనలో రసాభాస

MP Vamshi Krishna: పుష్కరాల సందర్భంగా సీఎం పర్యటనలో కాంగ్రెస్ నేతలే నిరసనకు దిగారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతీ పుష్కరాల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్, ఎంపీ వంశీ కృష్ణ అభిమానులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పుష్కరాలలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఫోటోను ఫ్లెక్సీలలో పెట్టకపోవడం ఏంటని నిలదీశారు. దళిత నాయకుని అవమానించారంటూ పలువురు కాంగ్రెస్ నాయకులు భారీ ఎత్తున ఫ్లెక్సీలతో సీఎం రేవంత్ రెడ్డి ఎదుట నిరసన వ్యక్తం చేశారు. దీనిని గమనించిన పోలీసులు వారిని అదుపులో తీసుకొని పోలీస్ స్టేషన్ తరలించారు.