సింగరేణి జాబ్ మేళాకు భారీ స్పందన

Singareni:గోదావరిఖనిలో జరుగుతున్న సింగరేణి మెగా జాబ్ మేళాకు నిరుద్యోగులు భారీగా హాజరయ్యారు. ఉదయం నుండే పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువతీ యువకులు తరలివచ్చారు. ఈ జాబ్ మేళాలో హైదరాబాద్ కి చెందిన 80 కి పైగా కంపెనీలు పాల్గొంటున్నాయి. 3వేల ఖాళీల భర్తీకి అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఈ మేరకు సింగరేణి జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో భారీ ఏర్పాట్లు చేసింది. ఈ జాబ్ మేళాలో ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, రామగుండం MLA మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్, సింగరేణి సిఎండీ బలరామ్పాల్గొంటారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like