నమాజ్ చేసి ప్రారంభిద్దామనుకున్నం.. భారత్ ముగించేసింది..

మేం నమాజ్ చేసి భారత్ పై దాడులు చేద్దామనుకున్నాం.. కానీ ఈలోపే భారత్ దాడులు ప్రారంభించి ముగించిందని పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ అన్నారు. అజార్ బైజాన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. భారత్ పై తామే ముందు దాడి చేద్దామనుకున్నామని.. కానీ తమ కన్నా ముందే భారత్ బ్రహ్మోస్ మిస్సైల్స్‌తో తమపై దాడి చేసిందన్నారు. నమాజ్ తర్వాత దాడి చేద్దామనుకుంటే.. భారత్ ముందే దాడి చేసిందని ఆయన వెల్లడించారు. రావల్పండి సహా అనేక కీలక ప్రాంతాల్లో భారత్ చేసిన దాడుల్లో తమకు తీవ్ర నష్టం జరిగిందన్నారు. భారత్ రాబడి బాగా పెరిగిందని, ఆ దేశం ఎన్నో ఆయుధాలను సమకూర్చకుందన్నారు.
భారత్ తమను ఊహించని దెబ్బ కొట్టిందని పాకిస్తాన్ ప్రధానమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. మే 10వ తేదీన భారత్‌పై తమ ఆర్మీ దాడి చేయడానికి అంతా సిద్ధం చేసుకుందని, ఈలోపే భారత్ బ్రహ్మోస్ మిస్సైల్స్‌తో దాడి చేసిందని తెలిపారు. కీలక మిలటరీ బేస్‌లతోపాటు ఎయిర్‌పోర్టుపై దాడి చేసిందన్నారు. ‘ మే 10వ తేదీన ఇండియాపై దాడులు చేయడానికి ప్లాన్ చేశాం. పాకిస్థాన్ ఆర్మీ దాడులు చేయడానికి అంతా సిద్ధం చేసుకుంది. ప్రార్థనలు పూర్తయిన తర్వాత .. తెల్లవారుజామున 4.30 గంటలకు దాడి చేద్దామని అనుకున్నాం. పాకిస్థాన్ దాడి చేయడానికి ముందే ఇండియా దాడులు మొదలుపెట్టింది. పాకిస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో లాంగ్ రేంజ్ సూపర్ సోనిక్ బ్రహ్మోస్ క్రూయిస్ మిస్సైల్స్‌తో దాడులు చేసింది. రావల్‌పిండిలోని ఎయిర్‌పోర్టుపైనా దాడి చేసింద’న్నారు.
భారత్ దాడుల గురించి తమ ఆర్మీ చీఫ్ ఆసీం మునీర్ తనకు చెప్పారన్నారు షాబాజ్. భారత్ దాడుల వల్ల పాకిస్థాన్‌కు తీవ్ర నష్టం జరగిందని, భారత్ దాడి చేసిన టైమ్‌లో తమ దేశాన్ని కాపాడుకోవడం మినహా మరే మార్గంలేదని వెల్లడించారు. పోరు నష్టమన్న మునీర్ సలహా మేరకు తాను కాల్పుల విరమణకు అంగీకరించానని వెల్లడించారు. పహాల్గామ్ ఉగ్రదాడిపై ఇన్ని రోజుల తరువాత స్పందించిన షాబాజ్ షరీఫ్ అలా జరిగి ఉండాల్సింది కాదన్నారు.