అడ‌విని.. ఆయుధాన్ని వీడి…

Mallojula Venugopal Rao:మావోయిస్టు పార్టీ పొలిట్‌బ్యూరో స‌భ్యుడు మల్లోజుల వేణుగోపాల్‌ రావు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆయ‌న ముఖ్య‌మంత్రి ఫ‌డ్న‌వీస్‌కు ఆయుధం అప్ప‌గించారు. 43 ఏండ్ల పాటు కొన‌సాగించిన ఉద్య‌మాన్ని వీడి, అనుబంధం ఉన్న అడ‌విని వీడి జ‌న‌జీవ‌న స్ర‌వంతిలో క‌లిశారు. ఆయ‌న‌తో పాటు మ‌రో 60 మంది లొంగిపోయారు. ఈ మేర‌కు భారీ బ‌హిరంగ స‌భ ఏర్పాటు చేసిన మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం మ‌ల్లోజుల వేణుగోపాల్ రావు లొంగుబాటును మీడియా ముందుకు తీసుకువ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి మాట్లాడుతూ ఈ స‌మాజంలో హింస‌కు తావులేద‌న్నారు.

మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ముందు లొంగిపోయిన మావోయిస్టుల నేతల వివరాలు ఇలా ఉన్నాయి. మావోయిస్టు పార్టీ శ్రేణుల్లో కేంద్ర కమిటీ, పొలిట్ బ్యూరో మెంబర్ మల్లోజుల‌ వేణుగోపాల్ రావు అలియాస్ అభయ్, DKSZC సభ్యులు సలాకుల సరోజ అలియాస్ లత, ఇర్రి మోహన్ రెడ్డి అలియాస్ వివేక్, DVCMలు రాజు అలియాస్ కమలసాయి, గంగూ అలియాస్ జిత్రూ, శబరి అలియాస్ అర్జున్ (దళకమాండర్), రాజేష్ అలియాస్ నిఖిల్, మైను గవాడే, సాగర్ సైదం, పార్వతి అలియాస్ పద్మ సైదం, లత, రాందాస్ గవాడే, రవి. గడ్చిరోలి ఏరియా డిప్యూటీ కమాండర్ ప్రియాంక అలియాస్ వసంత లక్ష్మీ, ఏసీఎంలు రాగో మోహన్ దా, మంజూ కోవచ్చి, కోసా కోవాసే, మంగ్లో జోగా వేలో, నీలవెట్టి, పీపీసీఎంలు పైరావి కుంజం, బిచ్చం కడియామి, మాంగ్లి అలియాస్ కరుణా కుంజం, గీతా పోలియం, కమలేష్, రోహిత్ తేలం, జ్యోతి అలియాస్ సుగుణ మడ్కం, నర్సు అలియాస్ స్వరూప, విష్ణు ఊసెండి, సుకురో వెల్డా, సురేష్ తలాండే, మధు టేకం, రోప్ని కుర్చామి, అనితా మడ్కమి, గూగె గుర్కా, పీఎంలు భేమే అలియాస్ షర్మిల, ప్రగతి తాటి, అంజలి కుంజం, గంగ సోమాలు మడ్కం, బీమా సోడి, సునిత, కమలసాయి, గంగూ అలియాస్ జిత్రూ, శబర అలియాస్ అర్జున్ (దళకమాండర్), రాజేష్ అలియాస్ నిఖిల్, మైను గవాడే, సాగర్ సైదం, పార్వతి అలియాస్ పద్మ సైదం, లత, రాందాస్ గవాడే, రవి. గడ్చిరోలి ఏరియా డిప్యూటీ కమాండర్ ప్రియాంక అలియాస్ వసంత లక్ష్మీ, ఏసీఎంలు రాగో మోహన్ దా, మంజూ కోవచ్చి, కోసా కోవాసే, మంగ్లో జోగా వేలో, నీలవెట్టి, పీపీసీఎంలు పైరావి కుంజం, బిచ్చం కడియామి, మాంగ్లి అలియాస్ కరుణా కుంజం, గీతా పోలియం, కమలేష్, రోహిత్ తేలం, జ్యోతి అలియాస్ సుగుణ మడ్కం, నర్సు అలియాస్ స్వరూప, విష్ణు ఊసెండి, సుకురో వెల్డా, సురేష్ తలాండే, మధు టేకం, రోష్ని కుర్చామి, అనితా మడ్కమి, గూగె గుర్కా, పీఎంలు భేమే అలియాస్ షర్మిల, ప్రగతి తాటి, అంజలి కుంజం, గంగ సోమాలు మడ్కం, బీమా సోడి, సునిత, రజిత పోయం, రంజూ మోడియం, జున్ని, ఎడ్మే అలియాస్ మైనే మాధవి, భూమి అలియాస్ లచ్చి మడ్కామి, రితా కుంజం, అమోల్ సోడి, జోగి అలియాస్ అనూష ముచ్కం, అంకిత హలామి, మంజుల, బల్దేవ్ కుంజం, పాయోకో అలియాస్ రవి ఊకే, భూజి అలియాస్ అస్మిత, అస్మన్ అలియాస్ రాము కర్రం, మహేష్ టేలం, రురా అలియాస్ సునీల్, రమాబట్టి టేలం, సావి అలియాస్ సోవి తుమ్రేటిలు గడ్చిరోలిలో వీరంతా జనజీవన స్రవంతిలో కలిశారు.

 

Get real time updates directly on you device, subscribe now.

You might also like