తాగారు… దొరికారు..

Drunk And Drive:తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 2026 నూతన సంవత్సర వేడుకలు (New Year Clebrations) అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. పాత ఏడాదికి వీడ్కోలు పలుకుతూ.. కొత్త ఏడాదికి ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. కొత్త సంవ‌త్స‌రం సందర్భంగా అర్ధరాత్రి సంబరాలు అంబరాన్నంటాయి. ఈ వేడుకల్లో యువత ఆడి పాడి చిందులేశారు. అయితే మద్యం సేవించి వాహనం నడపరాదని, అర్ధరాత్రి వేళల్లో రోడ్లపై తిరగవద్దని పదే పదే పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. కానీ, మందుబాబులు మాత్రం ఫుల్‌గా మద్యం సేవించి చిందులు వేశారు…. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో అడ్డంగా బుక్కయ్యారు.

హైదరాబాద్ నగర శివారులో న్యూ ఇయర్ సందర్భంగా పోలీసులు పెద్దఎత్తున డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేశారు. నిన్న రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో రికార్డు స్థాయిలో కేసులు నమోదు అయ్యాయి. ఒక్క హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే 1,198 మందిపై కేసులు నమోదైనట్టు పోలీసులు వెల్లడించారు. తనిఖీల్లో భాగంగా పలు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

You might also like