కింది స్థాయి సిబ్బందిని వేధిస్తున్న ఉన్న‌తాధికారి

త‌మ‌ను పై అధికారి వేధింపుల‌కు గురి చేస్తున్నార‌ని స‌హ‌కార శాఖ‌కు చెందిన ప‌లువురు ఉద్యోగినులు ఉన్న‌తాధికారుల‌కు ఫిర్యాదు చేశారు. త‌మ‌ను అన‌వ‌స‌రంగా వేధిస్తున్న అతనిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. రాత్రిపూట మహిళా సిబ్బందికి ఫోన్ కాల్స్, వాట్సప్ మెస్సెజ్ లు పంపుతున్నారని ఆరోపిస్తూ అధికారులకు లేఖ రాశారు.

ఆదిలాబాద్ డీసీఓ (జిల్లా సహకార అధికారి) బీ. మోహన్ పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయ‌డం క‌ల‌క‌లం సృష్టించింది. త‌మ‌ను వేధిస్తున్నార‌ని కో ఆపరేటీవ్ సొసైటీ ఉన్నతాధికారులకు ఏకంగా 14 మంది ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. అసభ్యకరమైన భాష, అనుచితమైన వ్యాఖ్యలు చేస్తున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ప్ర‌త్యేక అధికారుల బృందం హైదరాబాద్ నుంచి వచ్చి విచారణ చేస్తోంది. ఓ ఉన్న‌తాధికారి త‌మ‌ను వేధిస్తున్నార‌ని ఉద్యోగులు ఆరోపించ‌డం, దానిపై విచార‌ణ చేస్తుండ‌టం క‌ల‌క‌లం సృష్టిస్తోంది.

You might also like