ఆదిలాబాద్ లో చైన్ స్నాచింగ్
Chain snatching:ఆదిలాబాద్ లో చైన్ స్నాచింగ్(Chain snatching) ఘటన చోటుచేసుకుంది. ఉదయం 7:30 గంటల సమయంలో పట్టణంలోని కుమార్ పేట కాలనీలో తోట లత తన ఇంటి ముందు ముగ్గు వేస్తున్నారు. ఈ క్రమంలో వెనుక నుండి బైక్ మీద ఇద్దరు వ్యక్తులు హెల్మెట్లు పెట్టుకొని వచ్చి ఆమె మెడలోని 3 తులాల బంగారం గోలుసును లాక్కొని వెళ్లిపోయారు. వన్ టౌన్ బాధితురాలు ఫిర్యాదు చేశారు. స్థానిక సీసీ ఫుటేజ్ పరిశీలించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.