సోనియాగాంధీకి అస్వ‌స్థ‌త‌

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ(Sonia Gandhi) మ‌రోసారి అస్వస్థతకు గుర‌య్యారు. ఆమెను ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం సోనియా పరిస్థితి బాగానే ఉందని, తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్న కారణంగా ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రి వర్గాల సమాచారం ప్రకారం.. సోనియా గాంధీకి సీనియర్ పల్మనాలజిస్ట్ పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి స్థిరంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో నెలకొన్న తీవ్ర వాయు కాలుష్యం కారణంగానే సోనియాకి ఈ అనారోగ్యం ఏర్పడినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. వైద్యుల సూచనల మేరకు సోనియాగాంధీకి అవసరమైన పరీక్షలు నిర్వహిస్తున్నారు. పరిస్థితిని నిశితంగా వైద్యులు గమనిస్తున్నట్లు సమాచారం. గతంలోనూ సోనియా పలు ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చికిత్స పొందిన విషయం తెలిసిందే.

Get real time updates directly on you device, subscribe now.

You might also like