జాత‌ర బ‌స్సులు ప్రారంభించిన ఎమ్మెల్యే

సమ్మక్క జాతర సంద‌ర్భంగా బెల్లంపల్లి నుంచి బస్ సర్వీసులను ఎమ్మెల్యే గడ్డం వినోద్, సబ్ కలెక్టర్ మనోజ్ ప్రారంభించారు. కొత్త బ‌స్టాండ్ నుంచి ఈ బ‌స్సులు బ‌య‌ల్దేర‌నున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గడ్డం వినోద్ మాట్లాడారు. సమ్మక్క జాతర కోసం వెళ్లే భక్తులకోసం బెల్లంపల్లి కొత్త బస్టాండ్ నుంచి ప్రత్యేక బస్సు సదుపాయాన్ని కల్పించామన్నారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు చిలుముల శంకర్, జిల్లా కాంగ్రెస్ నాయ‌కులు సూరం ర‌వీంద‌ర్ పట్టణ అధ్యక్షుడు మల్లయ్య, మాజీ కౌన్సిలర్ రొడ్డ శారద ఆసిఫాద్ డిపో అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. బస్టాండ్లో సమ్మక భక్తుల కోసం తాగునీటి సదుపాయాన్ని సైతం కల్పించారు.

 

You might also like