పోలీస్ అకాడ‌మీలో పోకిరి

దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పోలీస్ శిక్షణా సంస్థ అయిన హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ (SVPNPA)లో లైంగిక వేధింపుల ఆరోపణలు తీవ్ర కలకలం రేపాయి. ట్రైనీ మహిళా ఐపీఎస్ అధికారిణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తోటి ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డిపై అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు.

బాధితురాలి ఫిర్యాదు ప్రకారం, నిందితుడు కొంతకాలంగా అసభ్యకరమైన సందేశాలు పంపుతూ వేధింపులకు పాల్పడుతున్నాడని పేర్కొన్నారు. అలాగే జూలై 9న బలవంతంగా గదిలోకి తీసుకెళ్లి బెదిరించడంతో పాటు, ఆమె ప్రైవేట్ వీడియోలను చిత్రీకరించి, వాటిని ఆమె భర్తకు వాట్సాప్ ద్వారా పంపినట్లు ఆరోపించారు.

ఫిర్యాదు ఆధారంగా అత్తాపూర్ పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సంబంధిత సెక్షన్లు 74, 75, 77, 315(2)తో పాటు సమాచార సాంకేతిక చట్టంలోని సెక్షన్ 66(C) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దేశంలో అత్యున్నత పోలీస్ శిక్షణా కేంద్రంలోనే ఈ ఘటన వెలుగులోకి రావడం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like