సెల్‌ఫోన్ బ్యాట‌రీ పేలి.. యువ‌కుడి మృతి

సెల్‌ఫోన్ బ్యాట‌రీ పేల‌డంతో ఓ యువ‌కుడు అక్క‌డిక‌క్క‌డే మృత్యువాత ప‌డ్డాడు. కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా చింత‌ల మానేప‌ల్లి మండ‌లం గూడెం గ్రామంలో యువ‌కుడు సెల్‌ఫోన్ బ్యాట‌రీ పాడ‌వడంతో దానిని కొరికాడు. దీంతో అది పేలింది. ఈ ఘ‌ట‌న‌లో నికాడి లోకేష్ (15) అనే యువ‌కుడు మృతి చెందాడు. బ్యాట‌రీ పేలుడు తీవ్ర‌త‌కు లోకేష్ నోరు, ముఖ భాగంలో తీవ్ర గాయాలు కావ‌డంతో అక్క‌డిక‌క్క‌డే మ‌ర‌ణించాడు. ఈ హృదయవిదారక ఘటన స్థానికంగా విషాదాన్ని నింపగా, ఘ‌ట‌న‌పై స‌మాచారం అందుకున్న పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like