మాదారంలో బైక్ ద‌హ‌నం

తాండూరు మండ‌లం మాదారం టౌన్‌షిప్‌లో బైక్ ద‌హ‌నం ఘ‌ట‌న క‌ల‌క‌లం సృష్టించింది. రామాల‌యం ప‌క్క‌నే ఉన్న గ‌ల్లీలో కోడెం స‌దానందం అనే వ్య‌క్తి ఇంటి ముందు బైక్ పార్క్ చేసి ప‌డుకున్నాడు. అర్ధ‌రాత్రి బైక్ కాలిపోతుండ‌టం గ‌మ‌నించిన ప‌క్క ఇంటి వారిని లేప‌డంతో మంట‌ల‌ను ఆర్పేశారు. ఉద‌య‌మే పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో వారు వ‌చ్చి ఘ‌ట‌నా స్థ‌లాన్ని ప‌రిశీలించారు. కొంద‌రు వ్య‌క్తులు కావాల‌నే ఈ బైక్ కాల‌బెట్టార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

You might also like