అండర్-14 బాలికల కబడ్డీ జిల్లా ఎంపిక పోటీలు విజయవంతం
జోనల్ స్థాయికి 16 మంది ఎంపిక
పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో తాండూర్ మండలం అచలాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం అండర్-14 బాలికల కబడ్డీ జిల్లా జట్టు ఎంపిక పోటీలు విజయవంతంగా నిర్వహించారు. 150 మంది విద్యార్థినులు పోటీల్లో పాల్గొని ప్రతిభ చాటుకున్నారు.
ఈ సందర్భంగా పాఠశాల వ్యాయామ విద్యఉపాధ్యాయుడు, పోటీల కార్యదర్శి ఏ. సాంబమూర్తి మాట్లాడుతూ.. విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి ఎంపిక పోటీలు ఎంతో దోహదపడతాయని తెలిపారు.
కార్యక్రమంలో అచలాపూర్ సర్పంచ్ మారిశెట్టి స్రవంతి, మండల విద్యాధికారి శ్రీనివాస్, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ మంచిర్యాల జిల్లా కార్యదర్శి ఎం.డి. యాకూబ్, వార్డు సభ్యులు దాగం పాపయ్య, పోచయ్య, కొండు సాయి, విజయ్‌కుమార్, పాఠశాల ఉపాధ్యాయులు డి. రాజేశ్వరరావు, శ్రీనివాస్ గౌడ్, సుధాకర్, హరిప్రసాద్, భాస్కర్, అంజిరెడ్డి, కె. శ్రీనివాస్, సురేందర్, రాజ్యలక్ష్మి, సీఆర్పీ నాగరాజు, తిరుపతి, క్రీడా నిర్వాహకులు స్టీఫెన్ రవీంద్ర, నక్క విజయ్ చందర్రావు, ప్రవీణ్‌కుమార్, సదానంద, ఎం. అశ్విని, తిరుమల తదితరులు ఎంపిక ప్రక్రియలో పాల్గొన్నారు.
జోనల్ స్థాయికి ఎంపికైన 16 మంది వీరే
కుందన శ్రీ – చైతన్య హైస్కూల్, బి. హర్షిత – ట్రినిటీ హైస్కూల్, సి.హెచ్. సాహితి – రేవలేషన్ స్కూల్, మౌనిక – జడ్పీహెచ్ఎస్ భీమిని, బి. రమాదేవి – జడ్పీహెచ్ఎస్ అచలాపూర్, సుదిషా – ఆల్ఫోర్స్ స్మార్ట్ స్కూల్, ఎం. శాన్విక – జడ్పీహెచ్ఎస్ భీమిని, రిషిక – రేవలేషన్ స్కూల్, ఎస్కే. సనా – జడ్పీహెచ్ఎస్ భీమిని, ఎం. రమాదేవి – కేజీబీవీ నస్పూర్, ఎం. ప్రవళిక – జడ్పీహెచ్ఎస్ భీమిని, బిందుశ్రీ – నిమ్స్, మంచిర్యాల, రిత్విక – ట్రినిటీ హైస్కూల్, శ్రీహర్ష – జడ్పీహెచ్ఎస్ అచలాపూర్, అక్షిత – జడ్పీహెచ్ఎస్ గర్ల్స్, మంచిర్యాల, అద్వైత – మీమ్స్ మంచిర్యాల.