రాప్తాడు నిందితుడి పై కాల్పులు

అనంతపురం జిల్లా రాప్తాడు పాఠశాల విద్యార్థినిపై రంపంతో దాడి చేసిన నిందితుడు హేమంత్‌పై పోలీసులు జరిపిన కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అతన్ని ఆసుపత్రికి తరలించారు.

రాప్తాడు జెడ్పీ ఉన్నత పాఠశాల క్లాస్‌రూమ్‌లోకి చొరబడి పదో తరగతి విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో అత్యంత పాశవికంగా దాడి చేసిన ఉన్మాది హేమంత్‌ ఆత్మకూరు అటవీ ప్రాంతంలోకి పారిపోయాడు. అతన్ని గుర్తించిన పోలీసులు పట్టుకునెందుకు ప్రయత్నించినప్పుడు, అతడు పోలీసులపై రాళ్లతో దాడి చేసి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. నిందితుడు పారిపోయేందుకు యత్నించడంతో పోలీసులు ఆత్మరక్షణ కోసం నిందితుడిపై ఆరు రౌండ్లు కాల్పులు జరిపారు.

బుల్లెట్ గాయాలతో కుప్పకూలిన హేమంత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని భారీ బందోబస్తు మధ్య అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి (GGH) చికిత్స నిమిత్తం తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం

You might also like