సీఎంను కలిసిన సినీనటుడు మహేష్‌బాబు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో ప్రముఖ సినీనటుడు మహేశ్ బాబు భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. శనివారం హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (MCRHRD)లో ఈ సమావేశం జరిగింది. ముఖ్యమంత్రిని మహేశ్ బాబు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇద్దరూ కాసేపు వివిధ అంశాలపై మాట్లాడుకున్నారు. అయితే ఈ భేటీకి సంబంధించిన ప్రత్యేక కారణాలను వెల్లడించలేదు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మహేశ్ బాబు ఒకే చోట కనిపించడంతో ఈ సమావేశంపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఇద్దరి కలయికను ప్రస్తావిస్తూ పలువురు అభిమానులు, నెటిజన్లు పోస్టులు పెట్టారు. ‘ఇద్దరు ప్రముఖులు కలిస్తే ఆ క్షణం ప్రత్యేకంగా మారుతుంది. ఒకరు లక్షలాది మంది మనసులను గెలుచుకున్న సూపర్‌స్టార్ కాగా, మరొకరు తెలంగాణ భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న ప్రజా నాయకుడు’ అనే అర్థం వచ్చేలా ఓ పోస్టు వైరల్‌గా మారింది. దీంతో ఈ భేటీ ఫొటోలు, వివరాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.