పరీక్ష కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ

ఎస్ఐ ప్రాథమిక రాత పరీక్షలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. జేఎన్టీయూ, రాష్ట్ర పోలీసు రిక్రూట్మెంట్ బోర్డ్ ఆధ్వర్యంలో మొత్తం 28 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 10,104 మంది అభ్యర్థులు పరీక్ష రాయాల్సి ఉండగా, 9,016 మంది అభ్యర్థులు హాజరయ్యారు. 1,088 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా 300 మంది పోలీసు సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసిన‌ట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్ల‌డించారు. ఆయ‌న ఆదిలాబాద్ వన్ టౌన్, టూ టౌన్, రూరల్, మావల పోలీస్ స్టేషన్ల పరిధిలోని పలు పరీక్షా కేంద్రాలను సందర్శించి భద్రతా ఏర్పాట్లను, పరీక్షల నిర్వహణ తీరుపరిశీలించారు.

మొదటగా పరీక్ష రాసే అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపి, అభినందించారు. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పర్యవేక్షిస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి. మౌనిక, ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి, స్థానిక సీఐలు బి. సునీల్ కుమార్, కె. నాగరాజు, బి.డి. ప్రేమ్ కుమార్, రహీం పాషా, డి. వెంకటి, టి. మురళి, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

You might also like