మందమర్రిలో ఎక్స్‌ప్లోజివ్స్ ప్లాంటు
డైరెక్టర్లు ఎస్.చంద్రశేఖర్, ఎన్.బలరామ్ వీడియో సమీక్ష
మందమర్రిలో ఎక్స్‌ప్లోజివ్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుట్టింది. ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్‌తో కలిసి మందమర్రి ప్రాంతంలో ఏడాదికి 40 వేల టన్నుల పేలుడు పదార్ధాల సైట్ మిక్స్డ్ ఎమల్షన్ ప్లాంటు ఏర్పాటు చేయడానికి సర్వ సన్నద్ధమైంది. ఈ మేరకు ఇప్పటికే రెండు దఫాలుగా ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్ అధికారులతో చర్చించారు. ఈ విషయంలో శనివారం దాని విధివిధానాల ఖరారుకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో సింగరేణి డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎస్.చంద్రశేఖర్, డైరెక్టర్ (పి అండ్ పి, ఫైనాన్స్, పర్సనల్) బలరామ్ పాల్గొన్నారు.
సింగరేణి సంస్థలో ప్రస్తుతం ఉన్న 19 ఓ.సి. గనులకు ఏడాదికి సుమారు 3 లక్షల టన్నుల ఎస్.ఎం.ఇ. అవసరమవుతోంది. సింగరేణి సంస్థ రామగుండం 3, మణుగూరుల్లో స్వంతంగా నిర్వహిస్తున్న ఎస్.ఎం.ఇ. ప్లాంటుల ద్వారా సుమారు 50 వేల టన్నుల ఎస్.ఎం.ఇ. ఉత్పత్తి చేస్తోంది. ఇంకా మిగిలిన 2 లక్షల 50 వేల టన్నుల ఎస్.ఎం.ఇ. ని ప్రైవేటు ఎక్స్స్లోజివ్స్ కంపెనీలు సరఫరా చేస్తున్నాయి. పేలుడు పదార్ధాలు అందిస్తున్న కంపెనీలు కొన్ని సార్లు సకాలంలో సరఫరా చేయనందున ఓ.సి. గనుల్లో ఉత్పత్తి ప్రక్రియ కుంటుపడుతోంది. దీన్ని నివారించేందుకు సింగరేణి ప్రాంతంలోనే మరో పేలుడు పదార్ధాల యూనిట్ ను నెలకొల్పాలని సి అండ్ ఎం.డి. ఎన్.శ్రీధర్ ఆదేశించారు.
ఈ నేపథ్యంలో ఐ.ఓ.సి.ఎల్. సంస్థ, సింగరేణి భాగస్వామ్యంతో ప్లాంట్ ఏర్పాటు చేయడానికి అంగీకరించింది. దీంతో దీనిని బెల్లంపల్లి రీజియన్ లోని మందమర్రి ప్రాంతంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే స్థలం కూడా నిర్ణయించామనీ, ఐ.ఓ.సి.ఎల్. తో కలిసి 40 వేల టన్నుల ప్లాంటును ఏడాదిలోగా ప్రారంభించనున్నామని తెలిపారు. సింగరేణి ఉత్పత్తి మరో 5 ఏళ్లలో 100 మిలియన్ టన్నులు చేరనున్న నేపథ్యంలో సింగరేణి స్వంతగా ఉత్పత్తి సామార్ధ్యాన్ని కూడా పెంచుకుంటుందని తెలిపారు.
ఈ సమావేశంలో అడ్వయిజర్ (మైనింగ్) డి.ఎన్.ప్రసాద్, జీఎం (సి.డి.ఎన్.) కె.సూర్యనారాయణ, జీఎం (సిపిపి) కె.నాగభూషన్ రెడ్డి, జీఎం (స్ట్రాటజిక్ ప్లానింగ్) సురేందర్, జీఎం (ఎక్స్‌ప్లోజివ్స్) \సూర్యనారాయణ, జీఎం (సేఫ్టీ) ఆర్జీ1 రీజియన్ వెంకటేశ్వరరావు, ఎస్వోటు డైరెక్టర్లు దేవీ కుమార్, రవిప్రసాద్, జీఎం (ఎఫ్ అండ్ ఎ) వెంకటరమణ, ఏజీఎం షాలెమ్ రాజు, ఐఓసీ నుండి సిజీఎం (మార్కెటింగ్) సుమిత్రా పాలదీ, జీఎం(మార్కెటింగ్) మనీష్ గుప్త జీఎం (ఫైనాన్స్) శంకర్ కర్మాకర్ తదితరులు పాల్గొన్నారు.