‘అఖండ’ చూడండి.. బాలకృష్ణని కలవండి
బాలకృష్ణ ‘అఖండ’ సినిమా భారీ విజయం సాధించింది. బోయపాటి బాలయ్య కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే కాక ప్రపంచ వ్యాప్తంగా భారీ విజయం సాధించింది. మంచి కలెక్షన్స్ సైతం రాబట్టింది. ఇలాంటి కరోనా టైంలో ఇంత భారీ విజయం సాధించడం మామూలు విషయం కాదు. ఇదంతా బాలయ్య మానియానే. ఇటీవలే ఈ సినిమా 50 రోజుల వేడుక కూడా జరుపుకుంది. చాలా సంవత్సరాల తర్వాత ఒక సినిమా అర్ద శతోత్సవ దినోత్సవాలు జరుపుకుంది. ‘అఖండ’ సృష్టించిన మానియా అలాంటింది. ఏకంగా 100 సెంటర్లకు పైగా 50 రోజులు ఆడింది. ఇంకా థియేటర్లలో ఆడుతూనే వుంది. ప్రేక్షకులు ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టారు.. ఇంకా పడుతూనే ఉన్నారు.
తాజాగా ‘అఖండ’ సినిమా మొన్న శుక్రవారం నుంచి డిస్ని ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. ఓటీటీలో కూడా సరికొత్త రికార్డు సృష్టించింది ఈ సినిమా. 24 గంటల్లో భారతీయ సినిమాల్లో హాట్ స్టార్ లో ఇప్పటి వరకు ఏ సినిమా దక్కించుకొని వ్యూయర్ షిప్ ని ‘అఖండ’ దక్కించుకుంది. దీంతో చిత్ర బృందం ప్రేక్షకులకి ఓ సూపర్ ఆఫర్ ప్రకటించారు.
ఈ రోజు (23వ తేదీ) అర్ధరాత్రి వరకు ‘అఖండ’ సినిమాని ఓటీటీలో చూసి బాలకృష్ణ కలిసే ఛాన్స్ ని పొందేలా ఆఫర్ ప్రకటించారు. ఇవాళ రాత్రి వరకు ‘అఖండ’ సినిమాని హాట్ స్టార్ లో చూసిన వాళ్లలో 500 మంది లక్కీ విన్నర్స్ ని సెలెక్ట్ చేసి బాలకృష్ణని కలిసే అవకాశం కలిపించనున్నారు చిత్ర బృందం. అంతేకాక వీరికి బాలకృష్ణ చేతి మీదుగా త్రిశూలం కూడా అందించనున్నారు.