వృద్ధురాలి ఇంటికి వెళ్లిన జడ్జి

మెదక్: బాధితురాలి సమస్య తెలుసుకుని నేరుగా ఆమె ఇంటికి న్యాయమూర్తి వెళ్లిన ఘటన మెదక్ జిల్లాలో జరిగింది. శివంపేట మండలం శభాష్ పల్లి కి చెందిన వృద్ధురాలు శివమ్మ.. పింఛన్ అందక ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్య నర్సాపూర్ జూనియర్ సివిల్ జడ్జి అనిత దృష్టికి వెళ్లింది. వెంటనే బాధితురాలి ఇంటికి జడ్జి వెళ్లారు. జిల్లా కలెక్టర్ హరీశ్‌కు ఫోన్ చేసి.. శివమ్మకు పింఛన్ మంజూరయ్యేలా చూడాలని కోరారు. బాధితురాలికి తగిన న్యాయం చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. సమస్య పరిష్కారానికి నేరుగా జడ్జి గ్రామానికి రావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.