మోదీకి షాక్ ఇచ్చేందుకు కేసీఆర్ ప్లాన్

హైద‌రాబాద్ : పార్ల‌మెంట్ స‌మావేశాలు ప్రారంభం అవుతున్న నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న ఆదివారం టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం కానున్నది. మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రగతి భవన్ లో ఈ స‌మావేశం నిర్వ‌హించ‌నున్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్న సందర్భంగా.. లోక్ సభ, రాజ్య సభల్లో టీఆర్ఎస్ పార్టీ అనుసరించాల్సిన వ్యూహం ఖరారు చేయనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన పలు అంశాలు, కేంద్రం నుంచి సాధించాల్సిన పెండింగ్ సమస్యల పై ఎంపీలకు నివేదికలు అందజేస్తారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్ర హక్కులను సాధించుకునేందుకు ఉభయ సభల్లో టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు, కేంద్రం పై అనుసరించాల్సిన పోరాట పంథా పై సీఎం కేసిఆర్ ఎంపీలకు సూచనలు ఆదేశాలు జారీ చేయ‌నున్నారు. మొత్తానికి కేంద్రాన్ని ఇరుకున పెట్టేందుకు పార్ల‌మెంట్‌లో పోరాటం చేయాల‌ని కేసీఆర్ ఎంపీల‌కు దిశానిర్దేశం చేయ‌నున్నారు.

You might also like