ఫ్లాష్.. ఫ్లాష్… రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృతి
మంచిర్యాల : రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. రామకృష్ణాపూర్ లోని ఏరియా ఆసుపత్రి వెనకాల ప్రధాన రహదారిపై ఒక బైకును అతి వేగంగా కారు ఢీ కొట్టింది. దీంతో భార్యభర్తలిద్దరు సంఘటన స్థలంలోనే మృతి చెందారు. భర్త పేరు వీరస్వామి. భార్య పేరు లక్ష్మి అని పోలీసులు వెల్లడించారు. వీరు గోదావరిఖనికి చెందిన వారుగా చెబుతున్నారు. మందమర్రి సీఐ ప్రమోద్ రావు, రామకృష్ణాపూర్ ఎస్ఐ సుధాకర్ ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు సాగిస్తున్నారు.