బెంగాలీ టీచర్లను నియమించండి
అసెంబ్లీలో కోరిన కోనప్ప
బెంగాలీ బోధించే అధ్యాపకులను నియమించాలని సిర్పూర్ ఎమ్యెల్యే కోనేరు కోనప్ప కోరారు. శుక్రవారం అసెంబ్లీ ప్రశ్నోత్సరాల సమయంలో ప్రసంగించిన ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పలు సమస్యలను ప్రభుత్వం ముందు ఉంచారు.
సిర్పూర్ నియోజకవర్గం లో సుమారు 20,000 మంది బెంగాలీ శరణార్ధులు ఉన్నారని అన్నారు. వారి మాతృభాష బెంగాలీ అని, ఆ బెంగాలీ బాషా లో బోధన జరుగక ఇబ్బంది పడుతున్నారని స్పష్టం చేశారు. డీఎస్సీ సెలక్షన్స్లో బెంగాలీ బోధించే అధ్యాపకులను నియమించాలని ఆయన విజ్ఞప్తి చేసారు. దీని కోసం స్పెషల్ జీవో తేవాలని మంత్రి గారిని ఎమ్మెల్యే కోరారు.