సీఎం పదవికి యోగి రాజీనామా

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాజీనామా చేశారు. శుక్రవారం ఆయన రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ ఆనందిబెన్‌ను కలిసి తన రాజీనామా లేఖను అందించారు. ఐదేళ్ల పాలన పూర్తి చేసుకున్న యోగి ఆదిత్యనాథ్ తాజా ఎన్నికల్లో ఘన విజయం సాధించి మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో గత మూడు దశాబ్దాల అనంతరం వరుసగా రెండోసారి ఎన్నికైన ఏకైక ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ రికార్డ్ సృష్టించారు. ఆయన తిరిగి పదవీ స్వీకారం చేసే ముహూర్తం ఇంకా ఖరారు కాలేదు.