విద్యుత్తు సిబ్బంది ఆర్థిక సాయం
పెద్దపెల్లి మండలం రంగంపల్లికి చెందిన కటికెనపల్లి రాజమౌళి బొంపల్లిలోని విద్యుత్ సబ్ స్టేషన్ లో వాచ్ మెన్ గా విధులు నిర్వహించేవాడు. కొద్ది రోజుల క్రితం అనారోగ్యానికి గురై ఇటీవల మరణించగా పెద్దపల్లి డివిజన్ లోని విద్యుత్ ఆర్టిజన్ లు,తోటి సిబ్బంది, విద్యుత్ ఉద్యోగులు కలసి శనివారం వారి కుటుంబానికి 50 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేసి ఆసరాగా నిలిచారు. ఈ కార్యక్రమంలో కొండి రమేష్,శిరీష్, దాసరి. కోటి, బొడ్డుపల్లి శ్రీనివాస్ సతీష్ రావు, కాంపల్లి రఘు, ఓదెలు శ్రీనివాస్, కిషన్ రెడ్డి పాల్గొన్నారు.